ఆదివారం మహారాష్ట్రలోని చిప్లూన్‌లో భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా రాత్రివేళ ఎక్కడి నుంచో వచ్చి రోడ్డుపై తిరుగాడుతున్న ఒక మొసలి వాహనదారులను బెంబేలెత్తించింది! మొసలి దాదాపు 8 అడుగుల పొడవుంటుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
గుజరాత్లో ముస్లిం యువకుడి దారుణ హత్య
అహ్మదాబాద్: బీజేపీ పాలిత గుజరాత్లో జూన్ 22న రాత్రి ఓ ముస్లిం యువకుడిని దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఆనంద్ జిల్లా చికోదర గ్రామంలో క్రికెట్ మ్యాచ్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ చూడటానికి వచ్చినవారికి, సల్మాన్‌కు పార్కింగ్ విషయమై ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సల్మాన్ మృతి చెందగా, మరో ఇద్దరు ముస్లింలు గాయపడ్డారు. నిందితుల్లో బీజేపీ ఎమ్మెల్యే బంధువు ఉన్నట్టు సమాచారం.
అరెస్ట్‌పై హైకోర్టుకు అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. తనను మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి ఆదేశిస్తూ జూన్ 26న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా సవాల్ చేశారు. జూన్ 29న ఆయనను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు పంపించింది.