UP Elections | వంద ఇవ్వలేం 26 సీట్లే ఇస్తాం.. యూపీలో కాంగ్రెస్, సమాజ్వాది పార్టీల మధ్య ఇంకా కొలిక్కిరాని చర్చలు..!
UP Elections | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో కాంగ్రెస్ (Congress), సమాజ్వాది పార్టీ (Samajwadi Party) ల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ పార్టీ తమకు 100 సీట్లు కావాలని డిమాండ్ చేస్తుంటే.. సమాజ్వాది పార్టీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. తాము కాంగ్రెస్కు 100 సీట్లు ఇవ్వలేమని, 26 సీట్లు మాత్రమే ఇవ్వగలమని మంగళవారం జరిగిన రెండో రోజు చర్చల సందర్భంగా సమాజ్వాది పార్టీ ఆఫర్ చేసింది.
UP Elections : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో కాంగ్రెస్ (Congress), సమాజ్వాది పార్టీ (Samajwadi Party) ల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ పార్టీ తమకు 100 సీట్లు కావాలని డిమాండ్ చేస్తుంటే.. సమాజ్వాది పార్టీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. తాము కాంగ్రెస్కు 100 సీట్లు ఇవ్వలేమని, 26 సీట్లు మాత్రమే ఇవ్వగలమని మంగళవారం జరిగిన రెండో రోజు చర్చల సందర్భంగా సమాజ్వాది పార్టీ ఆఫర్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఎస్పీ ఈ ప్రతిపాదన చేసింది.
సోమవారం జరిగిన చర్చల సమయంలో కాంగ్రెస్ పార్టీ కనీసం 60 ‘ఏ-గ్రేడ్ (A-grade)’ స్థానాలను.. అంటే కూటమికి బలంగా ఉన్న నియోజకవర్గాలను కోరినట్లు సమాచారం ఉన్నది. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ప్రతిపాదించిన సంఖ్య.. కాంగ్రెస్ ఆశించిన దానికంటే చాలా తక్కువగా ఉంది. కనీసం 100 స్థానాలు కావాలనే తమ డిమాండ్ నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్కు 26 స్థానాలను కేటాయించినట్లు సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్గోపాల్ యాదవ్ స్పష్టంచేశారు. అయితే ఆ సంఖ్య ఇంకా ఖరారు కాలేదు. ఆ 26 నియోజకవర్గాల్లో చాలాచోట్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10,000 కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. అయినప్పటికీ అక్కడ బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ 26 స్థానాల్లో సగానికిపైగా స్థానాలను కాంగ్రెస్ కోసం ‘బి-కేటగిరీ (Category B)’ కింద చేర్చారు. ఈ సంఖ్య ఫైనల్ కాకపోయినా ఇప్పుడు ఈ సంఖ్యపైనే చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కొంత సరళమైన వైఖరిని అవలంబించాలని తాము వినమ్రంగా కోరుతున్నామని సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్జీ లాల్ సుమన్ అన్నారు. దేశ ప్రజలు, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కూడా తమ రెండు పార్టీలు ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నారని సుమన్ చెప్పారు. మొదటి విడత చర్చలు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో (ఢిల్లీలో) జరిగాయి. 2027 ఎన్నికల కోసం ‘ఇండియా (INDIA)’ కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకంపై చర్చలు జరిపేందుకు సమాజ్వాదీ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయి.
2017, 2022 ఎన్నికలలో వరుస ఓటముల తర్వాత సమాజ్వాదీ పార్టీ మళ్లీ బలపడాలని ప్రయత్నాలు చేస్తున్నది. 2022 ఎన్నికలలో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయగా.. సమాజ్వాదీ పార్టీ తాను పోటీ చేసిన 347 స్థానాల్లో 111 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ తాను పోటీ చేసిన 399 స్థానాల్లో కేవలం రెండు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అయితే 2024 లోక్సభ ఎన్నికలలో ‘ఇండియా’ కూటమి తరపున కలిసి పోటీ చేసినప్పుడు, ఈ పార్టీలు మెరుగైన ఫలితాలను సాధించాయి.
సమాజ్వాదీ పార్టీ తాను పోటీ చేసిన 62 స్థానాల్లో 37 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ తాను పోటీ చేసిన 17 స్థానాల్లో ఆరు స్థానాలను గెలుచుకుంది. కాగా ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP Elections | వంద ఇవ్వలేం 26 సీట్లే ఇస్తాం.. యూపీలో కాంగ్రెస్, సమాజ్వాది పార్టీల మధ్య ఇంకా కొలిక్కిరాని చర్చలు..!
రాయరావుపేటలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై వివాదం.. కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదు
Harish Rao | అతిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన త్యాగం మాది : హరీశ్ రావు
Road accident | విషాదం..కొడుకును సాగనంపి, తిరిగిరాని లోకాలకు తల్లిదండ్రులు
Arrest | నకిలీ కరెన్సీ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు..నలుగురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

