రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేయడం అంత ఈజీ కాదన్న విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో తర్ఫీదు పొంది, ఎన్నోసార్లు ప్రయత్నిస్తే తప్ప దాన్ని పరిష్కరించలేం. అయితే, చెన్నైకి చెందిన జయదర్శన్ వెంకటేశన్ అనే బాలుడు కేవలం 14.32 సెకండ్లలోనే రూబిక్స్ క్యూబ్‌ను సెట్ చేశాడు. అదీ ఓ సైకిల్‌ను నడుపుతూనే ఈ ఫీట్ సాధించాడు. అందుకే సైకిల్ నడుపుతూ తక్కువ సమయంలో రూబిక్స్‌ను సాల్వ్ చేసిన వ్యక్తిగా వెంకటేశన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కాడు. రెండేండ్ల తర్ఫీదు అనంతరం తాను ఈ ఫీట్ సాధించినట్టు
అతడు తెలిపాడు.