ఇంఫాల్: బీజేపీ పాలిత మణిపూర్‌లోని ఇంఫాల్ నదిపై గల బైలీ వంతెన ఆదివారం కూలిపోవడంతో ఒక ట్రక్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్ గల్లంతయ్యారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఖేమ్‌చంద్ తెలిపారు.
బీహార్‌లో కూలిన మరో వంతెన
థాకర్గంజ్, జూలై 1: ఎన్డీయే పాలిత బీహార్‌లో వంతెనలు కూలడం ఆగేలా కనిపించడం లేదు! తాజాగా థాకర్గంజ్ బ్లాక్‌లో బంద్ నదిపై నిర్మించిన వంతెన భారీ వర్షాల ధాటికి కుప్పకూలింది. కోశీ దంగీ గ్రామంలో ఉన్న ఈ బ్రిడ్జ్‌ను 2008లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించారు.