Bomb threat : బీహార్ (Bihar) సీఎం కార్యాలయానికి (CMO) గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. సీఎం ఆఫీస్‌ను బాంబుతో పేల్చేస్తామని, బీహార్ స్పెషల్ పోలీసులు కూడా తమను అడ్డుకోలేరని ఆ మెయిల్స్‌లో హెచ్చరించారు. తాము అల్ కాయిదాకు సంబంధించిన వాళ్లమని పేర్కొన్నారు. గత నెల 16న వచ్చిన ఈ బెదిరింపు మెయిల్ గురించి సీఎం ఆఫీస్ అధికారులు ఇవాళ వెల్లడించారు.
ఈ బెదిరింపు ఈ మెయిల్‌పై బీహార్ పోలీసులు, ఉగ్రవాద వ్యతిరేక దళం (ATS) దర్యాప్తు జరుపుతున్నాయి. సచివాలయ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మెయిల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు.