LK Advani | బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (LK Advani ) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో (AIIMS Delhi) చేర్పించారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆయన్ని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం అద్వానీ వయసు 96 ఏళ్లు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతోనే ఆయనను దవాఖానలో చేర్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కాగా, మూడు నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న అద్వానీ రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందించారు.
Also Read..
Delhi | ఢిల్లీలో భారీ వర్షం.. మండుటెండల నుంచి ఉపశమనం
WHO | బద్ధకిస్తున్న భారతం.. శారీరక శ్రమకు దూరమవుతూ జబ్బులకు దగ్గరవుతున్న భారతీయులు