Anant Weds Radhika | అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట ఈ ఏడాది సందడి వాతావరణం కొనసాగుతోంది. ముకేశ్ – నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani ) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. రాధికా మర్చంట్ (Radhika Merchant)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరి వివాహానికి ముహూర్తం కుదిరింది. జులై 12న ముంబైలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంబానీ ఫ్యామిలీ నిశ్చయించింది.
ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ‘జియో వరల్డ్ ప్లాజా’ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వివాహ తంతు జులై 12న (శుక్రవారం) మొదలై.. జులై 14న (ఆదివారం) మంగళ ఉత్సవ్ (రిసెప్షన్)తో ముగియనుంది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ తారలు సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అనంత్ అంబానీ వివాహం నేపథ్యంలో ఇప్పటికే ఆ ఇంట వేడుకలు మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చిలో వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. గుజరాత్ జామ్ నగర్లో జరిగిన ఈ వేడుకలకు దేశ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. తాజాగా మరోసారి ప్రీవెడ్డింగ్ వేడులు కూడా షురూ అయ్యాయి. మే 29వ తేదీన ఇటలీ (Italy)లో వేడుకలు మొదలుకాగా.. జూన్ 1న స్విట్జర్లాండ్ (Switzerland)లో ముగియనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలు మొత్తం భారీ క్రూయిజ్ షిప్‌లోనే కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్‌లోని పెద్ద స్టార్స్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. మొత్తం 300 మంది వీవీఐపీలు ఈ వేడుకలకు ఆహ్వానించినట్లు సమాచారం.
Anant Ambani and Radhika’s Wedding to be held in Mumbai on 12th July at the Jio World Convention Centre in BKC. Wedding to be performed in accordance with the traditional Hindu Vedic way.
The main wedding ceremonies will start on Friday, 12th July with the auspicious Shubh… pic.twitter.com/YKnaAIAs7o
— ANI (@ANI) May 30, 2024
Also Read..
Amit Shah | కాశీ విశ్వనాథుడికి అభిషేకం నిర్వహించిన అమిత్‌షా దంపతులు
Arvind Kejriwal | రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్.. నేడు విచారణ
UK Parliament | సార్వత్రిక ఎన్నికలు.. బ్రిటన్ పార్లమెంట్ రద్దు