Rahul Gandhi | రాహుల్ గాంధీని కలిసిన మలేసియా ప్రధాని అన్వర్.. ఢిల్లీలో భేటీ
Rahul Gandhi : బ్రిక్స్ సదస్సు కోసం ఇండియా వచ్చిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. అక్కడే రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీని కూడా కలుసుకున్నారు.
Rahul Gandhi : బ్రిక్స్ సదస్సు కోసం ఇండియా వచ్చిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. అక్కడే రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీని కూడా కలుసుకున్నారు. బ్రిక్స్ కూటమిలో మలేసియా కూడా భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు కోసం మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఇండియా చేరుకున్నారు.
శని, ఆదివారం జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలో.. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించారు. అనంతరం ఉదయం ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఆయనను కలిశారు. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ కోసం రాహుల్‌ను అన్వర్ ఇబ్రహీం భేటీ అయ్యారు. రాహుల్ నివాసంలో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. వారితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని కాంగ్రెస్ తాజాగా విడుదల చేసింది. బ్రిక్స్ కూటమిలో మలేసియా సభ్య దేశం.
LoP Shri @RahulGandhi and Congress General Secretary Smt. @priyankagandhi ji met H.E. Dato’ Seri @anwaribrahim, Prime Minister of Malaysia today.
📍New Delhi pic.twitter.com/EV9PIDizwZ
— Congress (@INCIndia) September 13, 2026
మలేసియాతో ఇండియాకు సత్సంబంధాలున్నాయి. బ్రిక్స్ సదస్సు కోసం ఇండియా వచ్చిన ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో శనివారం సాయంత్రం మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై కీలక చర్చలు జరిపారు. ప్రధానంగా సెమీ కండక్టర్స్, వ్యాపారం, రక్షణ వంటి అంశాలపై చర్చించారు. అన్వర్ ఇబ్రహీం తన పర్యటన సందర్భంగా దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్‌ను గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి ప్రస్తావించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

