Kuala Lumpur airport | మలేషియా (Malaysia)లోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kuala Lumpur airport) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ సదుపాయంలో గ్యాస్ లీకైంది (gas leak). ఈ ఘటనలో సుమారు 39 మంది అస్వస్థతకు గురయ్యారు (passengers fall ill). అయితే, ప్రయాణికులు ఎవరూ తీవ్రంగా ప్రభావితం కాలేదని, విమాన ప్రయాణాలకు కూడా ఎలాంటి అంతరాయాలు కలగలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది.
సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ వద్ద గురువారం ఉదయం 11.23 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) కెమికల్ లీక్ గురించి అత్యవసర కాల్ వచ్చిందని, ప్రమాదకర మెటీరియల్స్ బృందంతో పాటు సిబ్బందిని పంపించామని సెలంగోర్ రాష్ట్ర అగ్నిమాపక విభాగం తెలిపింది. ప్యాసింజర్ టెర్మినల్‌కు ఇంజినీరింగ్ సౌకర్యంగా వేరుగా ఉందని పేర్కొంది. గ్యాస్ లీక్ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Amritpal Singh | జైలు నుంచి విడుదలైన అమృత్‌పాల్ సింగ్.. నేడు ఎంపీగా ప్రమాణం
Rishi Sunak | నన్ను క్షమించండి.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్
TGPSC | టీజీపీఎస్సీ ముట్టడి.. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల అక్రమ అరెస్టులు