రైల్వే స్టేషన్‌లోకి యముడొచ్చాడు..

Fri,November 8, 2019 09:56 AM


ముంబై: రైల్వే స్టేషన్‌లోకి యముడొచ్చాడు..పట్టాలపై ఉన్న ఓ వ్యక్తిని భుజానికెత్తుకొని వెళ్తున్నాడు. రైల్వే స్టేషన్‌లోకి యముడు రావడమేంటీ అనుకుంటున్నారా..? దేశవ్యాప్తంగా రైల్వే క్రాసింగ్‌లు, రైల్వే ట్రాక్‌ల వద్ద అవగాహన లేమితో నిబంధనలు అతిక్రమించి చాలా మంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ముంబై)రైలు ప్రమాదాల నుంచి కాపాడుకోవటానికి అవగాహన కార్యక్రమం నిర్వహించింది. యమరాజ్‌ వేషధారణలో ఉన్న వ్యక్తి రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న వారిని తన భుజానికెత్తుకొని..నిబంధనలు పాటించకపోతే మీరు ఇక డైరెక్టుగా వెళ్లేది యమలోకానికేనంటూ హెచ్చరించాడు.

5652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles