డీమానిటైజేషన్‌ను ప్రజలు మర్చిపోరు.. క్షమించరు: సోనియాగాంధీ

Fri,November 8, 2019 05:36 PM

హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని అదేవిధంగా ఆ అంశాన్ని ఎప్పటికీ మర్చిపోరని కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రధాని మోదీ సారధ్యంలోని యూపీఏ-1 ప్రభుత్వం 8 నవంబర్‌, 2016న రూ. 1000, రూ.500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. నేటితో మూడేళ్లు పూర్తియైన సందర్భంగా సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. అదోక తుగ్లక్‌ చర్య అన్నారు. పెద్ద నోట్ల రద్దు దేశంలోని సామాన్యులను, అమాయకులైన ప్రజలను బాధించిందన్నారు. మూడు సంవత్సరాలు గడుస్తున్నా దాని ప్రభావం ఇంకా కొనసాగుతుందన్నారు. ప్రతిపక్ష నాయకులు, నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ వంటి ఆర్థికవేత్తలు సైతం డీమానిటైజేషన్‌ను వ్యర్థమైన చర్యగా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ దిగజారుడుకి, పేదల అవస్థలకే ఇది పరిమితమైందని ఆమె పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను మోకాళ్లమీదకు తీసుకువచ్చిందన్నారు. బీజేపీ చెడు పాలనకు ఇదొక నిదర్శనమన్నారు.

823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles