గాయపడిన కోతిని కారులో ఆస్పత్రికి తరలించిన ఎంపీ

Tue,November 19, 2019 12:26 PM

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, పర్యావరణవేత్త మేనకా గాంధీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో ఎన్నోసార్లు సోషల్‌మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందించేవారు. తాజాగా స్పృహా లేకుండా పడి ఉన్న కోతిని రక్షించేందుకు సాయమందించి మరోసారి వార్తల్లో నిలిచారు. తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కన పడి ఉన్న కోతిని కాపాడేందుకు ఎవరైనా ముందుకు రావాలని కోరుతూ జర్నలిస్ట్ భారతీ జైన్ ట్విటర్లో మేనకా గాంధీని ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన మేనకా చికిత్స కోసం తన కారులోనే కోతిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.


'ఈ కోతి తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉంది. ఎన్జీవో, జంతుప్రేమికులు ముందుకొచ్చి దాన్ని కాపాడగలరు. ఢిల్లీలోని రైసినా రోడ్డులోని ప్రెస్‌క్లబ్ సమీపంలో అది పడిందని' పేర్కొంటూ మేనకను ట్యాగ్ చేస్తూ భారతీ జైన్ ట్వీట్ చేసింది. దీనిపై మేనకా ట్విటర్లో స్పందిస్తూ.. 'నన్ను ట్యాగ్ చేసినందుకు ధన్యవాదాలు. సంజయ్ గాంధీ జంతుసంరక్షణ కేంద్రంలో చికిత్స అందించేందుకు వెంటనే కారు పంపిస్తున్నాను. కొన్ని క్షణాల్లో ఆ కారు అక్కడుంటుందని' రిైప్లె ఇచ్చారు. మూగజీవిపై ప్రేమ చూపించిన మేనకా ప్రజల మనసు గెలుచుకున్నారు. ట్విటర్లో ఆమె సేవాగుణాన్ని పొగుడుతున్నారు.


542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles