సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాం: వైమానిక దళాధిపతి

Tue,October 8, 2019 01:53 PM

ఘజియాబాద్‌: భారత్‌కు ఎదురయ్యే ప్రతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కొంటామని వైమానిక దళాధిపతి రాకేష్‌ కుమార్‌ సింగ్‌ బదౌరియా అన్నారు. నేడు భారత వైమానిక దళం 87వ ఆవిర్భావ దినోత్సవాన్ని హిండన్‌ వైమానిక స్థావరంలో నిర్వహిస్తోంది. ఇక్కడ పరేడ్‌ సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా వైమానిక దళాధిపతి మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అనిశ్చితత్వం వల్ల దేశ భద్రతకు సవాళ్లు ఏర్పడ్డాయనీ, మేము నిరంతరం పరిస్థితులను సమీక్షించుకుంటూ, అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉన్న ఉప సైద్ధాంతిక సవాళ్లపైనా అప్రమత్తంగానే ఉన్నామని ఆయన పేర్కొన్నారు.


భారత వైమానిక దళం తీవ్రవాద మూకలపై దాడులు చేయడంలో సత్తా చాటుతుందన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు మేము సిద్దంగా ఉన్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పూర్తి నైపుణ్యంతో బాలాకోట్‌లోని తీవ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు చేసిన కమాండర్లు, యూనిట్ల సేవలు మర్చిపోలేనివనీ, వైమానిక దళంలోని అన్ని విభాగాలు పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.


1150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles