ఫరూక్ అబ్దుల్లా చెన్నై వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి..

Wed,September 11, 2019 08:42 PM

Vaiko Moves Top Court To Allow Farooq Abdullah To Travel To Chennai


న్యూఢిల్లీ : నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ఈ నెల 15న చెన్నైలో జరిగే కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని ఎండీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ వైగో సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

చెన్నైలో సెప్టెంబర్ 15న జరుగనున్న తమిళనాడు మాజీ సీఎం దివంగత సీఎన్ అన్నాదురై జయంతి కార్యక్రమంలో అబ్దుల్లా పాల్గొనాల్సి ఉందని వైగో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణ రద్దు నేపథ్యంలో రాజకీయ నేతలను నిర్బంధంలోకి తీసుకోవడంతో ఆగస్టు 5 నుంచి అబ్దుల్లా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని పిటిషన్‌లో వైగో పేర్కొన్నారు. డాక్టర్ అబ్దుల్లాను సుప్రీంకోర్టు ముందు హాజరు పరిచేలా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలని, చెన్నైలో జరిగే కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వీలుగా ఆయనకు స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించాలని కోరారు.

929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles