మెజారిటీ విద్యార్థులు క్లాస్‌రూమ్స్‌లో ఫోన్లు వద్దంటున్నారు..!

Tue,January 14, 2020 03:01 PM


డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తరగతి గదుల్లో మొబైల్‌ ఫోన్లను నిషేధించాలని యోచిస్తోంది. రాష్ట్రంలోని కాలేజీల్లో మొబైల్‌ ఫోన్ల నిషేధం అంశంపై పోలింగ్‌ నిర్వహించగా 51 శాతం విద్యార్థులు ఫోన్లపై నిషేధానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. క్లాస్‌రూమ్స్‌లో ఫోన్లపై నిషేధం విధించడం మంచి విషయమని విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. విద్యార్థులు క్లాస్‌రూమ్స్‌లో చెప్పే పాఠాలపై ఎక్కువగా శ్రద్దపెట్టేందుకు మొబైల్‌ ఫోన్ల నిషేధం ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫోన్లపై నిషేధం విధించాలని సమాలోచనలు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ ఉన్నతవిద్యాశాఖ మంత్రి ధన్‌సింగ్‌ రావత్‌ తెలిపారు.

1009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles