రూ.30 అడిగిందని త్రిపుల్ తలాక్ చెప్పేశాడు..

Tue,August 13, 2019 06:49 PM

UP Woman Allegedly Given Triple Talaq for asking rs30

హపూర్: అనారోగ్యానికి గురైన భార్య మందుల కోసమని ముప్పై రూపాయలు అడిగినందుకు భర్త ఆమెకు త్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. అనారోగ్యంతో బాధ పడుతున్న తన కూతురు మందుల కోసమని ఆమె భర్తను డబ్బులు అడిగినందుకు గాను తీవ్రంగా దూషించాడు. అంతలోనే త్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశారని అన్నది.

బాధితురాలు మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం నాకు పెళ్లయింది. మందుల కోసమని నా భర్తను రూ.30 అడిగాను. దీంతో ఆయన నాతో గొడవ పడి త్రిపుల్ తలాక్ చెప్పాడని వాపోయింది. ఆ తర్వాత ఆయన కుటుంబం అంతా కలిసి నన్ను ఇంటి నుంచి తోశేశారని చెప్పింది. తన ఇద్దరు పిల్లలను తనతో పాటు తీసుకెళ్తున్నట్లు తెలిపింది. హపూర్ జిల్లా డీఎస్పీ రాజేష్ సింగ్ మాట్లాడుతూ.. త్రిపుల్ తలాక్‌కు సంబంధించి కొన్ని రోజుల క్రితం మాకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేశాం. విచారణ జరిపి, అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం, 2019 ప్రకారం.. ఎవరైనా చట్ట విరుద్ధ త్రిపుల్ తలాక్‌కు పాల్పడితే మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుందన్న విషయం తెలిసిందే.

1308
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles