సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు: గులాం నబీ ఆజాద్‌

Mon,September 16, 2019 01:46 PM

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు గులాం నబీ ఆజాద్‌ సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో పర్యటించడానికి గానూ తాను సుప్రీంకోర్టును కోరిన మేరకు సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా(సీజేఐ) తనకు అనుమతినివ్వడం పట్ల ఆజాద్‌ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కశ్మీర్‌లో పర్యటించి అక్కడి పరిస్థితుల్ని తెలుసుకునేందుకు, అధికరణ 370 పట్ల ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు తనకు అవకాశం లభించిందన్నారు.


గత సారి రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జమ్మూ పర్యటన నిమిత్తం విపక్షాలను శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులోనే భద్రతరీత్యా అధికారులు వెనక్కి పంపించిన విషయం తెలిసిందే. ఈ సారి తన విన్నపాన్ని మన్నించి సుప్రీం అనుమతి ఇవ్వడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూనే, అక్కడి ప్రజల భావాలు తెలుసుకొని నివేదిక అందిస్తానన్నారు.

2202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles