లైంగికదాడి కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు చుక్కెదురు

Mon,August 19, 2019 09:28 PM

Supreme Court dismisses Tarun Tejpal petition

న్యూఢిల్లీ: లైంగికదాడి కేసులో తనపై మోపిన అభియోగాలను రద్దుచేయాలని కోరుతూ తెహల్కా పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. తేజ్‌పాల్‌పై సహచర మాజీ ఉద్యోగిని దాఖలు చేసిన ఈ కేసు విచారణను ఆరునెలల్లో పూర్తిచేయాలని జస్టిస్ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గోవాలోని దిగువ కోర్టును ఆదేశించింది. 2013లో గోవాలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ ఎలివేటర్‌లో సహచర మాజీ ఉద్యోగినిపై లైంగికదాడికి పాల్పడినట్టు అభియోగాలను ఎదుర్కొంటున్న తేజ్‌పాల్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ కేసులో తేజ్‌పాల్‌కు కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 2013 నవంబర్ 30వ తేదీన ఆయనను అరెస్టుచేశారు. ఆ తర్వాత 2014 మే నెల నుంచి బెయిల్‌పై బయట తిరుగుతున్న తేజ్‌పాల్.. తనపై అభియోగాలను కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలుచేసుకున్నారు. దీనిపై కోర్టు ఆగస్టు 6న తన తీర్పును రిజర్వులో పెట్టింది. తేజ్‌పాల్ పిటిషన్‌ను గోవా పోలీసులు వ్యతిరేకించారు. ఈ కేసులో తేజ్‌పాల్ నేరాన్ని రుజువుచేసేందుకు తగినన్ని ఆధారాలున్నాయని, కనుక ఆయన విచారణ ఎదుర్కోవాల్సిందేనని వారు కోర్టుకు విన్నవించారు. తేజ్‌పాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో గోవా కోర్టు వచ్చే నెల 23 నుంచి ఈ కేసు విచారణను పునఃప్రారంభించనున్నట్టు నార్త్‌గోవా జిల్లా జడ్జి విజయ్‌పోల్ ప్రకటించారు.

612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles