తరగతి గదిలో ఈవీఎంలు..బయట విద్యార్థులు

Thu,July 11, 2019 06:28 PM


పంజాబ్‌: తరగతి గది ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌)లతో నిండిపోయింది. దీంతో విద్యార్థులంతా స్కూల్‌ ఆవరణలో చదువు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని లూథియానా ప్రభుత్వ పాఠశాలలో వెలుగుచూసింది.

స్కూల్‌ కి సెలవులుండటంతో మే నెలాఖరు నుంచి జూన్‌, జులై 8వరకూ ఈవీఎంలను తరగతి గదిలో తాళం వేసి, బెంచీలను వరండాలో పెట్టి ఉంచారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పాం. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు వెంటనే తరగతి గదిని ఖాళీ చేయిస్తామని చెప్పారు. అయినా ఖాళీ చేయకపోవడంతో..చేసేదేమి లేక ఆరు బయటే విద్యార్థులకు పాఠాలు చెప్తున్నామని ప్రిన్సిపాల్‌ నందా తెలిపారు.


2174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles