సీబీఐ కొత్త డైరెక్టర్ ఎవరో తేలేది ఆ రోజే

Wed,January 16, 2019 06:19 PM

Special Panel led by PM Modi to decide new CBI chief on January 24th

న్యూఢిల్లీ: సీబీఐకి కొత్త డైరెక్టర్‌ను నియమించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ ఈ నెల 24న సమావేశం కానుంది. ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. మాజీ డైరెక్టర్ అలోక్ వర్మను ఈ కమిటీ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి సీజేఐ రంజన్ గొగొయ్ హాజరు కాలేదు. ఈసారి జరగబోయే సమావేశానికి హాజరవుతారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. నిర్బంధ సెలవుపై పంపిన అలోక్ వర్మను మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా నియమించిన సుప్రీం ధర్మాసనంలో రంజన్ గొగొయ్ సభ్యుడిగా ఉన్నందున ఆయన కమిటీ సమావేశానికి రాలేదు. ఆయన స్థానంలో జస్టిస్ ఏకే సిక్రి వచ్చారు. అలోక్ వర్మను తొలగించాలన్న వాదనను ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినా... సిక్రి సమర్థించడంతో 2-1 మెజార్టీతో ఆయనను తప్పించారు.

1813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles