దిశ నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి : జయ బచ్చన్‌

Mon,December 2, 2019 12:54 PM

న్యూఢిల్లీ : దిశ నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయ బచ్చన్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యసభలో దిశ హత్య ఘటనపై చర్చ సందర్భంగా జయ బచ్చన్‌ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒక పశు వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు. ఈ కేసు నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. వారిని ఉరి తీసేందుకు ఇదే సరైన సమయం అని జయ బచ్చన్‌ పేర్కొన్నారు. దిశ హత్యపై ప్రజలు కచ్చితమైన సమాధానం కోరుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. ప్రజల బాధ్యతల పట్ల ప్రభుత్వాలు బాధ్యాతయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఘోరమైన నేరానికి పాల్పడిన ఈ నలుగురు నిందితులకు కఠిన శిక్ష విధించాలి అని ఎస్పీ ఎంపీ జయబచ్చన్‌ డిమాండ్‌ చేశారు.


సిగ్గుతో తల దించుకుంటున్నా : సుప్రియా సూలే


హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచార, హత్య ఘటన పట్ల సిగ్గుతో తల దించుకుంటున్నానని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు. లోక్‌సభలో దిశ హత్యపై చర్చ సందర్భంగా సుప్రియా మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి అత్యాచార, హత్య ఘటనలను ఏ మాత్రం సహించకూడదని సుప్రియా సూలే స్పష్టం చేశారు.2023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles