పార్కింగ్ స్లిప్ అడిగితే చితకబాదారు..వీడియో

Thu,October 10, 2019 03:54 PM


న్యూఢిల్లీ: సెక్యూరిటీ గార్డుపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రి వద్దకు నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు కారులో వచ్చిన వ్యక్తులను పార్కింగ్ స్లిప్ చూపించాలని అడిగాడు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు కారులో నుంచి కిందికి దిగి సెక్యూరిటీతో ఘర్షణ పడ్డారు. సెక్యూరిటీ గార్డును అందరూ కలిసి కాలుతో తన్నుతూ తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలైన సెక్యూరిటీ గార్డును ఆస్పత్రిలో చేర్చారు. సెక్యూరిటీపై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




2734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles