కొత్త ట్రాఫిక్ జరిమానా ఆదాయ వనరు కాదు: గడ్కరీ

Wed,September 11, 2019 05:56 PM

revised traffic fines isnot a revenue income scheme says Nitin Gadkari


న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం పెంచిన ట్రాఫిక్ జరిమానా ప్రభుత్వానికి ఆదాయ వనరు కాదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. మోటార్ వెహికిల్ యాక్ట్-2019ను వ్యతిరేకిస్తూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేతలు గడ్కరీ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ..ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించకపోవడం వల్ల లక్షా 50 వేల మరణాలు నమోదుకావడం బాధపడే విషయం కాదా..? అని రోడ్డు ప్రమాదాలనుద్దేశించి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల ద్వారా సంభవించే మరణాలను తగ్గించాలనుకుంటే..ఇలాంటి నిబంధనలు అమలు చేయకపోతే ప్రజలు చట్టానికి భయపడరు. చట్టాన్ని గుర్తించరనే విషయం వాస్తవం కాదా..? అని ప్రభుత్వాలను ప్రశ్నించారు.

3960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles