జమ్మూలో ఆంక్షలు ఎత్తివేత.. కశ్మీర్‌లో కొనసాగింపు..

Wed,August 14, 2019 11:46 AM

Restrictions In Jammu Lifted and Will Continue In Kashmir For Sometime

హైదరాబాద్‌ : జమ్మూ ఆంక్షలు ఎత్తివేశామని, కశ్మీర్‌లో కొన్ని రోజుల పాటు ఆంక్షలు కొనసాగుతాయని జమ్మూకశ్మీర్‌ అడిషనల్‌ డీజీపీ మునీర్‌ ఖాన్‌ పేర్కొన్నారు. జమ్మూలో పాఠశాలలు, ఇతర సంస్థలు, వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయని తెలిపారు. కశ్మీర్‌లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం తాము పంద్రాగస్టు వేడుకలపై దృష్టి నిర్వహించామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ వేడుకలను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. శాంతియుతంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

అయితే ప్రస్తుతం 2010, 2016లో వైరల్‌ అయిన వీడియోలను ఇప్పుడు మళ్లీ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహాయిస్తే.. ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగలేదని అడిషనల్‌ డీజీపీ పేర్కొన్నారు.777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles