బీజేపీలో అత్యంత నిజాయితీప‌రుడు.. రాహుల్ గాంధీ ట్వీట్‌

Mon,October 21, 2019 01:09 PM

హైద‌రాబాద్‌: హ‌ర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఓట‌ర్ల‌ను హెచ్చ‌రిస్తున్న ఓ వీడియోను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. అసంద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే భ‌క్షిష్ సింగ్ విర్క్ ఓ స‌మావేశంలో మాట్లాడుతూ హెచ్చ‌రిక‌లు చేశారు. ఈవీఎంలో ఏ బ‌ట‌న్ నొక్కినా.. అది బీజేపీకే ద‌క్కుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఎవ‌రెవ‌రు ఎటువంటి బ‌ట‌న్ నొక్కుతున్నారో త‌మ‌కు తెలుసు అని, ప్ర‌ధాని మోదీ చాలా తెలివైన వ్య‌క్తి అని, మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ కూడా తెలివైన వ్య‌క్తే అని, మీరే బ‌ట‌న్ నొక్కినా.. అది బీజేపే ఖాతాలోకి వెళ్తుంద‌ని ఆ ఎమ్మెల్యే అన్నారు. ఆ వీడియోను ట్వీట్ చేసిన రాహుల్‌.. బీజేపీలో అత్యంత నిజాయితీప‌రుడైన నేత ఈయ‌నే అంటూ దానికి సెటైర్‌ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈవీఎంలు ట్యాంప‌ర్ అవుతున్నాయ‌న్న దానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌న్న ఉద్దేశంతో రాహుల్ ఆ ట్వీట్ చేశారు.



2676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles