భారత్‌.. పండుగల పుణ్యభూమి: ప్రధాని మోదీ

Tue,October 8, 2019 06:51 PM

ఢిల్లీ: ద్వారకాలోని రామ్‌లీలా మైదానంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. రావణ దహన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..'దేశ ప్రజలందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు. భారత్‌.. పండుగల పుణ్యభూమి . వివిధ ప్రాంతాల ప్రజలను పండుగలు కలుపుతాయి. ఉత్సవాలు సామూహిక శక్తిని ఇస్తాయి. పండుగలు భారతీయులను ఉత్తేజితం చేస్తాయి. ఏడాది పొడవునా ఎక్కడో ఒకచోట ఉత్సవాలు జరుగుతుంటాయి. మన సంప్రదాయం చెడుపై పోరాటం చేస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలతో ప్రజల జీవనం ముడిపడి ఉంది. ఉత్సవాలు వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతాయి. భారత్‌ రోబోలను రూపొందించదు.. మానవులను తయారు చేస్తుంది. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలి. రాముడు సామూహిక శక్తితో వంతెన నిర్మించి లంక దాటారని' మోదీ పేర్కొన్నారు.1285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles