మహాబలిపురంలో మోదీ, జిన్‌పింగ్ ప‌ర్య‌ట‌న ఖ‌రారు

Wed,October 9, 2019 10:03 AM

న్యూఢిల్లీ: భారత్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 11-12 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ తమిళనాడులోని చెన్నైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాధినేతలు చెన్నై సమీపంలోని కాంచీపురం జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. ఇక్కడ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భేటీ జరిగే వేదికతో పాటు ఆ ప్రాంతమంతా కొత్త హంగులతో కళకళలాడుతోంది. ప్రత్యేక సమావేశాలు జరగనున్న ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగం ఉన్నతాధికారులు ఇక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతేడాది రెండు రోజుల చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో జిన్‌పింగ్‌ను ప్రధాని మోదీ భారత్‌కు ఆహ్వానించారు. ప్రపంచ చరిత్రాత్మక వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా యునెస్కో గుర్తింపు పొందిన మహాబలిపురాన్ని చివరికి ఖరారు చేశారు.

1781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles