మోదీకి రాజకీయ పరిజ్ఞానం లేదు : ఓవైసీ

Wed,August 14, 2019 11:01 AM

PM Modi does not have political wisdom like Sardar Patel and Nehru says Owaisi

హైదరాబాద్‌ : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రుకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ప్రధాని నరేంద్ర మోదీకి లేదు అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నాడు కశ్మీర్‌ అంశంపై వారు సరైన నిర్ణయం తీసుకున్నారు. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ కూడా ఆర్టికల్‌ 370ను అంగీకరించిన విషయం మోదీకి తెలువదు అని ఓవైసీ గుర్తు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం కశ్మీర్‌ను ప్రేమిస్తుంది కానీ, కశ్మీరీలను కాదు. కశ్మీర్‌ భూమిపై ప్రేమ ఉంది కానీ.. అక్కడ నివసిస్తున్న ప్రజలపై మోదీకి ప్రేమ లేదు. న్యాయాన్ని వదిలేసిన బీజేపీ నాయకులు.. మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఎవరికైనా ఏది శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఓవైసీ స్పష్టం చేశారు.



1799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles