ఆ గేమ్ వల్లే ఫెయిలవుతున్నాం.. బ్యాన్ చేయండి!

Wed,January 16, 2019 04:54 PM

Please Ban PUBG students association in Jammu and Kashmir urges Governor

పబ్‌జీ గేమ్ తెలుసు కదా. ఈ మధ్య తెగ పాపులర్ అయిన గేమ్ ఇది. యువత ఈ గేమ్‌కు పూర్తిగా బానిసగా మారిపోయింది. రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతూనే గడిపేస్తున్నారు. దీంతో చదువులు అటకెక్కుతున్నాయి. దీని కారణంగా ఈ మధ్య విడుదలైన పది, పన్నెండో తరగతి పరీక్షల ఫలితాలు చాలా దారుణంగా వచ్చాయని, వెంటనే ఈ గేమ్‌పై నిషేధం విధించాలని జమ్ముకశ్మీర్ విద్యార్థుల అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ నాయక్‌ను కలిసి గేమ్‌పై నిషేధం విధించాల్సిందిగా కొందరు విద్యార్థులు కోరారు. విద్యార్థులు ఈ గేమ్‌కు బానిసలవుతున్నారని, ఈ మధ్య వచ్చిన పది, పన్నెండో తరగతి ఫలితాలను చూసిన తర్వాతైనా దీనిపై నిషేధం విధించాల్సిందని వాళ్లు అభిప్రాయపడ్డారు. పబ్‌జీ గేమ్‌ను వీళ్లు డ్రగ్స్‌తో పోల్చడం విశేషం. యువత 24 గంటలూ ఈ గేమ్ ఆడటం చూస్తుంటే.. డ్రగ్స్‌కు బానిసలైనట్లే కనిపిస్తున్నారు. అందుకే ఈ గేమ్‌ను వెంటనే బ్యాన్ చేయాలని గవర్నర్‌ను కోరుతున్నాం అని విద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు రఖిఫ్ మఖ్‌దూమి అన్నారు. భవిష్యత్తును నాశనం చేసే గేమ్ పబ్‌జీ అని జమ్ముకశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ అబ్రార్ అహ్మద్ భట్ చెప్పారు.

4478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles