ప్రపంచ బిలియర్డ్స్ ఫైనల్లో అద్వానీ

Sun,September 15, 2019 07:45 AM

మయన్మార్: భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 5-2తేడాతో ఇంగ్లండ్ ఆటగాడు మైక్ రసెల్‌పై విజయం సాధించాడు. 22వ టైటిల్ కోసం మయన్మార్ ఆటగాడు నే తివేవూతో తుదిపోరులో తలపడనున్నాడు. వరుసగా మూడుసార్లు వందకు పైగా పాయిం ట్లు సాధించిన పంకజ్ ఆధిపత్యం కనబరిచినా.. రెండింటినే ఫ్రేమ్స్‌గా మలచగలిగాడు. తొలి ఫ్రేమ్‌ను పంకజ్ సాధించగా.. రెండోది ఇంగ్లండ్ ప్లేయ ర్ ఒడిసిపట్టాడు. ఆ తర్వాత ఇద్దరు చెరోటి చేజిక్కించుకోవడంతో స్కోర్లు 2-2తో సమమయ్యాయి. ఆ తరుణంలో విజృంభించిన అద్వానీ వరుసగా మూడు ఫ్రేమ్‌లతో అదరగొట్టి గెలిచేశాడు. మరో సెమీస్‌లో భారత ఆటగాడు సౌరవ్ కొఠారీ 3-5 తేడాతో నేతివేవూ చేతిలో పరాజయం చెందాడు.

302
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles