పాకిస్థానీ మహిళకు 35 ఏళ్ల తర్వాత భారత పౌరసత్వం

Fri,October 4, 2019 11:47 AM


ముజఫర్ నగర్: పాకిస్థానీ మహిళ 35 ఏళ్ల తర్వాత భారత పౌరసత్వం అందుకుంది. పాకిస్థాన్‌కు చెందిన జుబేదా(55) ముజఫర్‌నగర్‌ జిల్లాలోని యోగేందర్‌పూర్‌ వాసి అయిన మహ్మద్‌ జావెద్‌ను 1994 లో పెళ్లి చేసుకుంది. పెళ్లయిన వెంటనే జుబేదా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే న్యాయపరమైన సమస్యల కారణంగా ఆమెకు అప్పట్లో పౌరసత్వం రాలేదు. అప్పటి నుంచి జుబేదా లాంగ్‌ టర్మ్‌ వీసాపై భారత్‌లో ఉంటోంది. తాజాగా జుబేదాకు భారత పౌరసత్వం వచ్చిందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జుబేదా భారతీయురాలి అని, ఆమె ఆధార్‌, రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జుబేదాకు ఇద్దరు కూతుళ్లు రుమేషా (30), జుమేషా (26) ఉండగా..వారిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 25 మంది పాకిస్థానీ మహిళలు భారతీయులను వివాహమాడి..ముజఫర్‌నగర్‌లో లాంగ్‌ టర్మ్‌ వీసాపై నివాసముంటున్నారు.

4065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles