4 కిలోలు బరువు తగ్గిన చిదంబరం

Fri,October 18, 2019 06:41 PM

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం 4 కిలోల బరువు తగ్గారు. చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ విషయాన్ని ఆయన తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో వెల్లడించారు. చిదంబరం ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని, వచ్చేది శీతాకాలమని, డెంగీ కూడా వచ్చే అవకాశం ఉందన్నారు న్యాయవాది. మానవత్వంతో ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. చిదంబరం సాక్షులను ప్రభావితం చేస్తారనే అనుమానం ఉంటే వారికి ప్రభుత్వం రక్షణ కల్పించొచ్చు అని సూచించారు. కానీ చిదంబరం సాక్షులను ప్రభావితం చేయలేదని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.


ఇక ఈ కేసులో సీబీఐ ఢిల్లీ కోర్టులో శుక్రవారం ఛార్జిషీటు దాఖలు చేసింది. చిదంబరంతో పాటు 13 మందిని నిందితులుగా పేర్కొంది సీబీఐ. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు విదేశీ నిధులు సమకూర్చడంలో చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఛార్జిషీటులో ఆరోపించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైల్లో ఉన్నారు.

778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles