మాల్యా పిటిషన్ ను కొట్టిపారేసిన బాంబే హైకోర్టు

Thu,July 11, 2019 09:53 PM

No HC relief to Mallya on proceedings for seizure of assets


ముంబై: తన ఆస్తుల జప్తును నిలిపివేయాలని లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యా దాఖలు చేసిన పిల్ ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్న ఆస్తుల జప్తుపై స్టే విధించాలని మాల్యా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన జస్టిస్‌ అఖిల్ ఖురేషి, జస్టిస్‌ ఎస్‌జే కథవాలాతో కూడిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. భారతీయ బ్యాంకులకు రూ.9,000 కోట్లు రుణాల ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్‌ ఆఫ్ మనీ లాండరింగ్ ఆక్ట్) కోర్టు మాల్యాను ఇప్పటికే ‘పారిపోయిన ఆర్థిక నేరస్థుడి’గా ప్రకటించింది.

827
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles