గవర్నర్‌ గారూ.. ఎప్పుడు రావొచ్చు?

Wed,August 14, 2019 02:25 PM

No Conditions When Can I Come Rahul Gandhi Comeback To JK Governor

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌కు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కౌంటర్‌ ఇచ్చారు. డియర్‌ మాలిక్‌ జీ.. నా ట్వీట్‌పై మీ పస లేని స్పందన చూశాను. జమ్మూకవ్మీర్‌కు రావాలన్న మీ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను. ఎలాంటి షరతులు లేకుండా అక్కడి ప్రజలను కలుస్తాను. నేను ఎప్పుడు రావొచ్చు? అని సత్యపాల్‌ మాలిక్‌కు కౌంటర్‌ ఇస్తూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

జమ్ము కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయంటూ వార్తలు వస్తున్నాయన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ మండిపడ్డ విషయం విదితమే. రాహుల్ కు విమానం పంపిస్తామని, కశ్మీర్ పరిస్థితిని కళ్లారా చూసి మాట్లాడాలన్నారు. అయితే గ‌వ‌ర్న‌ర్ మాలిక్ వ్యాఖ్య‌ల‌కు రాహుల్ గాంధీ నిన్న కౌంట‌ర్ ఇచ్చారు. త‌న ట్విట్ట‌ర్‌లో గ‌వ‌ర్న‌ర్ మాలిక్ ఆహ్వానాన్ని స్వాగ‌తించారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో క‌లిసి క‌శ్మీర్‌లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌మ‌కు విమానం అవ‌స‌రం లేద‌ని, కానీ క‌శ్మీర్‌లో స్వేచ్ఛ‌గా తిరిగే ప‌రిస్థితుల‌ను క‌ల్పించాల‌న్నారు. స్థానిక ప్ర‌జ‌ల‌ను, ముఖ్య నేత‌ల‌ను, సైనికుల‌ను క‌లుసుకుంటామ‌ని రాహుల్ త‌న ట్విట్ట‌ర్‌లో చెప్పారు. ఇవాళ తాజాగా మరో ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.

1647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles