కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలు చేయం: మమతా బెనర్జీ

Wed,September 11, 2019 06:53 PM

New motor act Won't Apply In Bengal says Mamata Banerjee

కోల్‌కతా: కొత్త మోటారు వాహన చట్టం-2019ని పశ్చిమ బెంగాల్‌లో అమలు పరిచేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ జరిమానాలను తగ్గించిన మరుసటి రోజే మమతా ఈ నిర్ణయం ప్రకటించారు. మోటారు వాహనాల చట్టంలో సవరణలు చాలా దారుణంగా ఉన్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు. సమాఖ్య ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా చట్టం ఉన్నట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. డబ్బే సమస్యకు పరిష్కారం కాదని మానవతా ధృక్పథంతోని ఆలోచించాలన్నారు. రోడ్డు భద్రతలో భాగంగా బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే సేఫ్ డ్రైవ్ సేఫ్ లైఫ్ పేరుతో ఉన్నతస్థాయి ప్రచారాన్ని చేపట్టిందన్నారు.

1769
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles