కుటుంబ సభ్యులకు విషమిచ్చి.. ప్రియుడితో పరారీ ..

Thu,September 12, 2019 01:36 PM

Minor Girl elopes with lover after poisoning family in Uttar Pradesh

లక్నో : ఓ మైనర్ తన ప్రేమకు అడ్డొస్తున్న కుటుంబ సభ్యులకు విషమిచ్చి.. ప్రియుడితో పరారైంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మోర్దాబాద్ జిల్లాలోని మైంథేర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది కాలం నుంచి అరవింద్ కుమార్ అనే యువకుడు.. ఓ మైనర్‌ను ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెతో యువకుడు సన్నిహితంగా మెలిగి శారీరకంగా లోబర్చుకున్నాడు. అయితే గతేడాది డిసెంబర్‌లో తన కూతురిని అరవింద్ అత్యాచారం చేశాడని మైనర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అరవింద్‌ను పోలీసులు విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడిని పోలీసులు జైలుకు తరలించారు.

ఇటీవలే బెయిల్‌పై విడుదలైన అరవింద్.. తమ ప్రేమకు అడ్డుపడొద్దని బాలిక కుటుంబ సభ్యులను బెదిరించాడు. మొత్తానికి బాలిక కూడా అరవింద్ మాయలో పడిపోయింది. ఈ క్రమంలో అరవింద్ ప్లాన్ ప్రకారం.. బాలిక తమ కుటుంబ సభ్యులకు ఆహారంలో విషం కలిపి ఇచ్చింది. వారు అపస్మారకస్థితిలోకి వెళ్లిన తర్వాత అరవింద్‌తో బాలిక లేచిపోయింది. సాధారణ స్థితికి చేరుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషాహారం తిన్న వారిలో బాలిక తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలు, ఇద్దరు సోదరిమణులు, వదిన, మేనల్లుడు ఉన్నారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

3061
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles