హెచ్‌ఎన్‌ఎల్సీ వేర్పాటువాద సంస్థపై నిషేధం

Mon,November 18, 2019 10:19 PM

న్యూఢిల్లీ : మేఘాలయ కేంద్రంగా వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెన్యుట్రిప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ (హెచ్‌ఎన్‌ఎల్సీ)పై కేంద ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు సోమవారం అధికార ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థ హింసాత్మక ఘటనలకు పాల్పడటంతోపాటు మేఘాలయాలోని ఖాసి, జైన్‌టియా తెగలు నివసించే ప్రాంతాల్లో వేర్పాటువాదానికి పాల్పడుతున్నదని ఆరోపించింది.


ప్రజలను భయపెట్టి వారి నుంచి డబ్బులు దోచుకోవడం, ఇతర తిరుగుబాటు సంస్థలతో సంబంధాలు నెలకొల్పడం, బంగ్లాదేశ్‌లో శిక్షణ శిబిరాలు నిర్వహించడం వంటి కార్యకలాపాలతో భారత సార్వభౌమత్వం, సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నది తెలిపింది. ఈ నేపథ్యంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం హెచ్‌ఎన్‌ఎల్సీతోపాటు దాని అనుబంధ విభాగాలు, సంస్థలు చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ నిషేధం విధించినట్లు పేర్కొంది. గతంలోనూ హెచ్‌ఎన్‌ఎల్సీపై 2000 నవంబర్ 16న నిషేధం విధించగా అనంతరం దాన్ని ఎత్తివేశారు.

418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles