ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు

Mon,October 21, 2019 11:14 AM

మంబయి: మహారాష్ట్ర, హర్యానాలలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ మొదలయింది. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆయన భార్యతో కలిసి నాగ్పూర్ లో ఓటింగ్ లో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్పూర్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ నాగ్పూర్‌లో, ఎన్‌సీపీ సీనియర్ లీడర్ సుప్రియా సూలే బారమతిలో ఓటు వేశారు. కాగా, ఆమె సోదరుడు ఎన్‌సీపీ నాయకుడు అజిత్ పవార్ పడాల్కర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గోపీచంద్‌పై పోటీ చేస్తున్నారు. ఒలంపిక్ విజేత, బీజేపీ లీడర్ యోగేశ్వర్‌దత్ బరోడాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


ఎన్‌సీపీ లీడర్ ప్రపూల్ పటేల్, ఆయన భార్య వర్ష, నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ అంధేరీలో, బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్‌ఖాన్ బాంద్రా వెస్ట్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి, ఆయన భార్య లారా దత్తా, సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కూడా బాంద్రాలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్, తన భార్య జెనీలియాతో కలిసి లాతూర్‌లో ఓటు వేశారు. అతని సోదరులు అమిత్ దేశ్‌ముఖ్, ధీరజ్ దేశ్‌ముఖ్ కాంగ్రెస్ ఎమ్యెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.





















537
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles