తల్లి ఒడి నుంచి శిశువు కిడ్నాప్ విఫలం.. వీడియో

Wed,September 18, 2019 11:44 AM

అమృత్‌సర్: నాలుగేళ్ల శిశువును కిడ్నాప్ చేయడానికి యత్నించి ఓ వ్యక్తి కటకటలాపాలయ్యాడు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. లుధియానాలోని రిషినగర్ ప్రాంతంలో గడిచిన రాత్రి ఇంటి బయట కుటుంబ సభ్యులతో శిశువు నిద్రిస్తుంది. కాగా ఓ వ్యక్తి రిక్షాపై వచ్చి తల్లి ఒడిలో నిద్రిస్తున్న శిశువును తీసుకుని రిక్షాలో పడుకోబెట్టి వెళ్లబోయాడు. కాగా సదరు మహిళ అలజడిలో అప్రమత్తమై దిగ్గున లేచి రిక్షాలో పడుకోబెట్టిన శిశువును తన చేతుల్లోకి తీసుకుంది. వెంటనే ప్రక్కన పడుకున్నవారు మరో మహిళ సైతం లేచి అప్రమత్తమయ్యేసరికి సదరు కేటుగాడు అక్కడి నుంచి రిక్షాతో పాటు ఊడాయించాడు. క్షణకాలం ఆలస్యమైనా శిశువు అదృశ్యమయ్యేది. ఈ విషయమంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

2479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles