ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీని ఆహ్వానించిన గవర్నర్...

Sat,November 9, 2019 07:56 PM

ముంబయి : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ప్రభుత్వ ఏర్పాటు భారతీయ జనతా పార్టీని ఆహ్వానించారు. ఎన్నికల్లో మెజార్టీ వచ్చిన అతిపెద్ద పార్టీ కావడంతో బీజేపీని ఆహ్వానించినట్లు గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీకి 145 మంది శాసన సభ్యుల మద్దతు కావాలి. తమను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను శివసేన నాయకులు కోరిన సంగతి తెలిసిందే. బీజేపీతో చర్చలంటూ జరిగితే ముఖ్యమంత్రి పదవిపైనేనని శివసేన నేత సంజయ్‌రౌత్‌ తేల్చి చెప్పారు. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని, ఆ సంఖ్య 175కు కూడా పెరుగొచ్చని పేర్కొన్నారు.


50-50 ఫార్ములాకు కట్టుబడి ఉంటే బీజేపీకే మంచిది.. లేదంటే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చూపిస్తామన్నారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల పాటు రెండు పార్టీలు పంచుకుందామని శివసేన డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గవర్నర్ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ఆహ్వానించడం చర్చాంశనీయంగా మారింది. ఇటీవల జరిగిన మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపొందింది. ఆ రాష్ర్టంలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 288.

1027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles