వరద ఉధృతిలో చైన్ గా ఏర్పడి సరస్సు దాటారు..వీడియో

Sun,August 18, 2019 06:08 PM

Locals form a human chain to cross a flooded rivulet between Dobhi and Fozal village


హిమాచల్ ప్రదేశ్ : హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. కుండపోత వర్షాలు జనాలకు కునుకులేకుండా చేస్తున్నాయి. మనాలీ, కుల్లూ, కన్నౌర్ తోపాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న బాధితులు దోభి, ఫొజల్ గ్రామాల పరిధిలోని ఓ సరస్సును ఒకరినొకరు పట్టుకుని చైన్ గా (గొలుసు)ఏర్పడి ఒడ్డుకు వచ్చారు. ఓ వైపు వరద పెరుగుతున్నప్పటికీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఒడ్డుకు చేరారు.

బియాస్ నదిపై ఉన్న ఓ వంతెన వరద ఉధృతి పాక్షికంగా కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు కొండ ప్రాంతాలు విరిగి రోడ్లపై పడ్డాయి. కన్నౌర్ లోని రిబ్బలో కొండచరియలు రోడ్డుపై పడటంతో నేషనల్ హైవే పై రాకపోకలు నిలిచిపోయాయి. మనాలీ-కుల్లూ మార్గంలో రహదారి దెబ్బదినడంతో వాహనాలు నిలిచిపోయాయి.
\

2363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles