‘జిమ్నాస్టిక్స్’ విద్యార్థులపై ఒలంపిక్ విజేత ప్రశంసలు

Thu,September 5, 2019 06:11 PM

kolkata students applauded by Olympic gold medalist gymnast Nadia Comaneci


కోల్ కతా: కోల్ కతా విద్యార్థులు జశికా ఖాన్ (11), మహ్మద్ అజారుద్దీన్ (12) జిమ్నాస్టిక్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. జశికా ఖాన్, మహ్మద్ అజారుద్దీన్ స్కూల్ బ్యాగ్స్ వేసుకుని రోడ్డుపై జిమ్నాస్టిక్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. విద్యార్థులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు.

తాజాగా ఈ వీడియోకు ఒలంపిక్స్ లో ఐదు సార్లు స్వర్ణం గెలిచిన జిమ్నాస్ట్ విజేత నదియా కొమనెసి తోపాటు, కేంద్ర కీడ్రా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఫిదా అయ్యారు. విద్యార్థుల ఫీట్ వీడియోను ట్యాగ్ చేస్తూ..ఇది అద్బుతమని ట్వీట్ చేసింది నదియా. ఒలింపిక్ విజేత నదియా కొమనెసి నుంచి ప్రశంసలు లభించడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు జశికా, అజారుద్దీన్.

నదియా మేడమ్ నన్ను ప్రశంసించడం గురించి చాలా సంతోషించా. ఈ విషయాన్ని మా అమ్మానాన్నలకు చెప్పా. వారు చాలా సంతోషంగా ఫీలయ్యారు. నాలుగేళ్లుగా నేను జిమ్నాస్టిక్స్ చేస్తున్నా. నదియా లాగా నేను కూడా భవిష్యత్ లో మంచి జిమ్నాస్ట్ గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నానని జశికా ఖాన్ మీడియాతో చెప్పింది.

మా డ్యాన్స్ టీచర్ గొప్పగా చెప్పుకునేలా ఏదైనా కొత్తగా చేయాలని ఉంది. నాకు భవిష్యత్ లో జిమ్నాస్టిక్స్ లో అవకాశమొస్తే తప్పకుండా చేస్తా. అయితే నేను డ్యాన్స్ ను మాత్రం వదిలిపెట్టనని మహ్మద్ అజారుద్దీన్ చెప్పుకొచ్చాడు.
1138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles