కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Tue,January 14, 2020 01:26 PM

తిరువనంతపురం: కేరళ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏ(సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కేరళ అసెంబ్లీ ్లపార్టీలకతీతంగా సీఏఏని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కాగా, సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయడానికి బీజేపీయేతర సీఎంలకు కేరళ సీఎం పినరయి విజయన్‌ లేఖలు రాశారు. దేశంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ .. ఎన్‌ఆర్‌సీ, సీఏఏను ముందు నుంచే వ్యతిరేకిస్తున్నారు. ఆయా యూనివర్సిటీల్లో తీవ్రమైన ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా జేఎన్‌యూలో సీఏఏకి సంబంధించి విధ్వంసం చోటు చేసుంకుంది.

2128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles