భారత్‌లో దాడులకు ఐఎస్‌ఐ యత్నం..

Tue,January 14, 2020 02:41 PM

హైదరాబాద్‌: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ భారత్‌లో దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇంటిలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీ, గుజరాత్‌లలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడచ్చని ఐబీ అంచనా వేస్తోంది. నేపాల్‌ నుంచి ఆరుగురు ఉగ్రవాదులు భారత్‌లో చొరబడ్డారని.. ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలే లక్ష్యంగా వారు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ తెలిపింది. దీంతో ఇరు రాష్ర్టాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలపై పోలీసులు నిఘా ఉంచాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఇంటిలిజెన్స్‌ బ్యూరో సూచించింది.

1137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles