ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఆత్మహత్య

Wed,August 14, 2019 11:54 AM

IPS Officer Allegedly Shoots Himself At Home In Faridabad Near Delhi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో విషాదం నెలకొంది. ఫరీదాబాద్‌ డీసీపీ(డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు)గా సేవలందిస్తున్న విక్రమ్‌ కపూర్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సొంతింట్లో ఇవాళ ఉదయం 6 గంటలకు విక్రమ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. విక్రమ్‌ నిజాయితీగల పోలీసు ఆఫీసర్‌ అని సహచరులు పేర్కొన్నారు. విక్రమ్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

1464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles