ఇందిరాగాంధీ జన్మ నివాసానికి రూ.4.35 కోట్ల పన్ను నోటీసు

Wed,November 20, 2019 07:25 AM

ప్రయాగ్‌రాజ్: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల ఆనంద్ భవన్‌లో జన్మించారు. ఇప్పుడు ఆ ఇంటికి ప్రభుత్వం రూ.4.35 కోట్ల పన్ను నోటీసు జారీ చేసింది. 2013 నుంచి టాక్స్ చెల్లించలేదని పేర్కొంటూ నాన్ రెసిడెన్షియల్ కేటగిరి కింద అధికారులు పన్ను నోటీసు జారీ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో జవహర్‌లాల్ నెహ్రు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆనంద్ భవన్ గాంధీ కుటుంబానికి నివాసంగా ఉంటూ వస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, ఆస్తి చట్టాలననుసరించి ట్యాక్స్ నోటీసులు జారీ చేసినట్లు ప్రయాగరాజ్ చీఫ్ ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆఫీసర్ పీ.కే. మిశ్రా తెలిపారు. దీనిపై అభ్యంతరాలను సైతం ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. కాగా ఎటువంటి ఫిర్యాదులు రాలేదన్నారు. దీంతో పన్ను మదింపు వేసి తాము నోటీసు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై పీఎంసీ మాజీ మేయర్ చౌదరి జితేంద్రనాథ్ సింగ్ స్పందిస్తూ.. ఆనంద్ భవన్‌పై పన్ను విధించరాదు. ఎందుకంటే ఈ భవన్ జవహర్‌లాల్ నెహ్రు మెమోరియల్ ట్రస్ట్ పరిధిలో ఉంది. ఈ ట్రస్ట్ అన్ని రకాల పన్నుల నుంచి మినహాయింపు కలిగి ఉందన్నారు. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఇటువంటి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని స్థానికుడొకరు అభిప్రాయపడ్డారు.

1279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles