ఈ వీడియో చూస్తే తేనె ముట్టనంటారు..

Thu,August 22, 2019 09:09 PM

Honeycomb occured on jeanes pant kiranrijiju shares the vedio

తేనె అంటే ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి..కానీ ఈ వీడియో చూశాక తేనె అంటే అసహ్యించుకునే వారు కూడా ఉంటారనిపిస్తోంది. సాధారణంగా ఏ చెట్లపైనో లేదా పాడుబడ్డ ఇండ్లపై కప్పుపైనో తేనెపట్టును పెట్టడం చూస్తుంటాం..కానీ తేనెపట్టు మనిషికి అంటుకుని ఉంటే ఎలా ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది.

ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో ఓ వ్యక్తి జీన్స్ పాయింట్ వెనుకాల (నడుం కిందిబాగాన) తేనెపట్టు కనిపించిన ఈ వీడియోను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ మారడంతో..ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇక జీవితంలో తేనె ముట్టనని ఓ నెటిజన్ సరదాగా కామెంటు పోస్ట్ చేశాడు. ఇంకా నయం జీన్స్ పాయింట్ వేసుకున్నావు కాబట్టి ప్రాణాలతో ఉన్నావ్..లేదంటే అంతేసంగతి అంటూ మరో వ్యక్తి కామెంట్ పోస్ట్ చేశాడు. మరికొందరైతే వీడియో పూర్తిగా లేకపోవడంతో ఆ తర్వాత ఏమై ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.
7409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles