మహారాష్ట్ర్రలో 22.79 శాతం, హర్యానాలో 33.46 శాతం

Mon,October 21, 2019 02:07 PM


ముంబై: మహారాష్ట్ర, హర్యానాలలో ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలవగా..ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటేయడానికి వస్తున్నారు. మహారాష్ట్రలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 22.79 శాతం పోలింగ్ నమోదవగా.. హర్యానాలో 33.46 శాతం పోలింగ్ నమోదైంది.


వీటితోపాటు మరోవైపు వివిధ రాష్ట్ర్రాల్లో 51 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు ఇవాళ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. 96 ఏళ్ల ఖన్నా అనే వృద్ధుడు ఓటేసి ఓటు ప్రాధాన్యతను తెలియజేశారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఖన్నాతో కలిసి పోలింగ్ కేంద్రం బయట సిరా గుర్తును చూపిస్తూ అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బీడ్ లో దివ్యాంగుడిని అతని బంధువు ఓటేయడానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు మోసుకొచ్చాడు.


607
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles