ఎంపీ, ఎమ్మెల్యే మిస్సింగ్..గ్రేటర్ నోయిడా వాసుల ధర్నా

Wed,August 14, 2019 05:41 PM

Greater Noida people protest with a missing poster of MP Mahesh Sharma, MLA Tejpal


యూపీ: ఎంపీ మహేశ్ శర్మ, ఎమ్మెల్యే తేజ్ పాల్ సింగ్ కనిపించడం లేదంటూ గౌతమ్ బుద్దనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఆందోళనకు దిగారు. సూరజ్ పూర్ లోని గ్రేటర్ నోయిడా వాసులు ఎంపీ మహేశ్ శర్మ, ఎమ్మెల్యే తేజ్ పాల్ సింగ్ అదృశ్యమయ్యారని బ్యానర్లు అంటించి..నిరసనకు దిగారు. తమ ప్రాంతంలో రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని..ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏ ఒక్క నేత పట్టించుకోవడం లేదని గ్రేటర్ నోయిడా వాసులు ఆందోళన చేపట్టారు. ఎన్నికలు రాగానే ఓట్లు వేయించుకున్న తర్వాత నేతలు మళ్లీ ఇక్కడికి తిరిగి రాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఆచూకీ చెబితే రూ.501 బహుమతిగా ఇస్తామని చెబుతున్నారు.


మేమంతా మహేశ్ శర్మ, తేజ్ పాల్ సింగ్ కు ఓటేశాం. మా ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది. దెబ్బతిన్న రోడ్లపై విద్యుత్ స్తంభాలు వంగి ఉన్నాయి. ఒకవేళ కరెంట్ తీగలు కింద పడితే షాక్ కొట్టి ప్రాణాలు పోయే ప్రమాదం పొంచి ఉంది. రోడ్లు దెబ్బతినడంతో పిల్లలు కింద పడిపోతున్నారు. ఏడాదికాలంగా రోడ్ల గురించి మేం ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. కానీ ఎంపీ మహేశ్ శర్మ, ఎమ్మెల్యే తేజ్ పాల్ సింగ్ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. నేతలు ఇప్పటికైనా స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపించాలని నోయిడా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

756
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles