వరదలో చిక్కుకున్న చంద్రబాబు నివాసం

Wed,August 14, 2019 11:10 AM

flood water enters into Former AP CM Chandrababu Naidus residence in Undavalli

అమరావతి: ఉండవల్లిలోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద వరద ఉద్ధృతి భారీగా ఉంది. వరద నీరు నివాసంలోకి రాకుండా ఇంటి చుట్టూ స్టోన్ క్రష్, ఇసుక బస్తాలతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుంచి తరలించారు. ఇంట్లో కింది గదుల్లోని సామాన్లను సిబ్బంది మేడపైకి తీసుకొచ్చారు. నీటి ప్రవాహంతో ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదని సెక్యురిటీ సిబ్బంది తెలిపారు. వరద మరింత పెరిగితే ఇంట్లోకి నీరు వెళ్లే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే.. చంద్రబాబు నివాస పరిసరాలను కూడా పరిశీలించారు. చంద్రబాబు నివాసమైన లింగమనేని గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు.

ఆర్కే మాట్లాడుతూ..'పులిచింతల నుంచి భారీ స్థాయిలో నీరు విడుదలవుతోంది. బాబు నివాసం రివర్ వ్యూ భవనం, వాకింగ్ ట్రాక్‌లో వరద నీరు వచ్చి చేరింది. లారీలతో ఇసుక తరలించి చంద్రబాబు ఇంటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చంద్రబాబు కాన్వాయ్‌ను హ్యాపీ రిసార్ట్స్‌కి తరలించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వరదలు రాలేదు. వరద వస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో బాబుకు ఇప్పుడు అర్థమైంది. తన ఇల్లు మునుగుతుందనే భయంతో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఎప్పటికైనా నదీ గర్భంలో నిర్మించిన ఇళ్లను ఖాళీ చేయాల్సిందేనని' ఆయన స్పష్టం చేశారు.

3474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles